బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై

* మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు.

జనం న్యూస్: బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదైంది. హైద్రా ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని సంబంధిత సెక్షన్లు, పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.‘‘2014వ సంవత్సరంలో హెచ్‌ఎండిఏ దుర్గం చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌పై ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయినప్పటికీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి దుర్గం చెరువు ప్రాంతంలో మట్టి, రాళ్లను నింపి… సుమారు 5 ఎకరాల దుర్గం చెరువును ఆక్రమించారు. వారు ఆక్రమించిన భూమిని ఎస్‌టిఎస్ ప్రైవేట్ రవాణా పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. 2014 నుంచి ఈ భూమి ఆక్రమణలో ఉంది’’ అని హైడ్రా అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డిపై BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్-3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు మాదాపూర్ తెలిపారు. స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి తనపై నమోదైన కేసుకు సంబంధించి మీడియా చిట్ చాట్‌లో స్పందించారు. తాము గతంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశామని.. కానీ తర్వాత అధికారులు దానిని చెల్లదని ప్రకటించి, టీడీఆర్ జారీ చేశారని చెప్పారు. ఆ తర్వాత కాలం దుర్గం చెరువును అభివృద్ధి జరిగిందని తెలిపారు.  పక్కనే నటుడు బాలకృష్ణ , లహరి ఎస్టేట్స్ వారి హరిబాబుకు చెందిన భూములు ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌కు అనుమతించినందుకు తనపై కేసు నమోదు చేశారని అన్నారు. దుర్గం చెరువు వద్ద తనకు ఎలాంటి భూమి లేదని చ ెప్పారు. తాను ఒక్క అంగుళం ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపించినా, ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *