తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

* 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీ.

జనం న్యూస్: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దాదాపు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయని న్యూ ఇయర్ కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ తెలపనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్‌ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్‌ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. నూతన సంవత్సర కానుకగా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 3 నోటిఫికేషన్లు విడుదల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే పోలీసు రిక్రూట్‌మెంట్లు జరిగాయి. మూడు రిక్రూట్మెంట్ల ద్వారా 43,206 పోస్టులు భర్తీ చేశారు. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ మూడు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. 2023న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పటికీ పోలీస్ రిక్రూట్మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు 14వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కావాల్సి ఉంది అని తెలియడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి నోటిఫికేషన్. ఇకపోతే ఏపీలో పోలీస్ శాఖలో భారీగా పదవీ విరమణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుళ్ల భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతోంది. సిబ్బంది తగ్గుముఖం పట్టడం వల్ల పోలీస్ శాఖలు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోస్టులను రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్‌ అవుతుంది. నోటిఫికేషన్ ఆలస్యం అయ్యేకొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *