సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నెక్స్ట్ జనరేషన్ సివిల్ హెలికాప్టర్ ధృవ్ ఎన్జీని ప్రారంభించాడు. కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు నెక్స్ట్ జనరేషన్ సివిల్ హెలికాప్టర్ ధృవ్ ఎన్జీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) బెంగళూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి HAL చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ డా. డీకే సునీల్‌తో పాటు HAL ఉన్నతాధికారులు, విమానయాన రంగ నిపుణులు పాల్గొన్నారు. కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసలేంటి ధృవ్ ఎన్జీ సివిల్ హెలికాప్టర్, దాని ప్రత్యేకతలేంటి అనే విషయాలు తెలుసుకుందాం! అసలేంటి ధృవ్ ఎన్జీ ధృవ్ ఎన్జీ ( DHRUV-NG ) ఒక అడ్వాన్స్‌డ్ సివిల్ హెలికాప్టర్. 2025 ఏరో ఇండియా షోలో, HAL ప్రదర్శించిన స్వదేశీ హెలికాప్టర్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ప్రకారం,DHRUV-NG అనేది 5.5 టన్నుల బరువున్న, లైట్ ట్విన్ ఇంజిన్, మల్టీ రోల్ హెలికాప్టర్, భారత భూభాగం యొక్క విభిన్న , డిమాండ్ ఉన్న అవసరాలను తీర్చడానికి దీనిని రూపొందించారు.ప్రపంచ పౌర విమానయాన మార్కెట్ అవసరాలను తీర్చేలా దీనిని ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేశారు. మెరుగైన భద్రత, పనితీరు, ప్రయాణీకుల సౌకర్యం కోసం దీనిని రూపొందించారు. ఈ హెలికాప్టర్ స్వదేశీ రోటరీ-వింగ్ సామర్థ్యంలో ఒక కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. DHRUV-NG ట్విన్ శక్తి 1H1C ఇంజిన్లతో అమర్చబడి ఉంది. ఇంటర్నల్ మెయింటెనెన్స్ ఎనేబులింగ్ విషయంలో,ఇది భారతదేశంలో హై పవర్ రేటింగ్ కలిగి ఉంది. ధృవ్ ఎన్జీ (Dhruv NG ) ఫీచర్లు ఇవే! సివిల్-సర్టిఫైడ్ గ్లాస్ కాక్‌పిట్ , అధునాతన ఏవియానిక్స్‌తో పైలట్‌లతో ధృవ్ ఎన్జీని మోడర్న్ సివిలియన్ హెలికాప్టర్‌గా రూపొందించామని అధికారులు తెలిపారు. కఠినమైన ఫ్లైయింగ్ కండిషన్స్‌లో కూడా సంక్లిష్టమైన మిషన్స్‌ను చేపట్టేలా దీనిని రూపొందించారు. సేఫ్టీ , రిలయబిలిటీ ఈ హెలికాప్టర్ రూపకల్పనలో కీలకమైన అంశాలు.