సాక్షి డిజిటల్ న్యూస్: 2029 ఎన్నికల్లో 119 స్థానాలు ఉంటే 80పైగా సీట్లతో అధికారంలోకి వస్తాం. 153 సీట్లు అయితే 100కిపైగా సీట్లతో ప్రభుత్వం అధికారంలోకి వస్తాం. అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం అని చెప్పుకొచ్చారు. 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం ఖాయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘రెండింతల మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వం.ఇదే నా శపథం’అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో నిర్వహించిన సర్పంచుల సమావేశ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.కోస్గి, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్, కొత్తపల్లికి చెందిన సర్పంచ్‌లతో భేటీ అయ్యారు. 180 మంది సర్పంచ్‌లు, 180 మంది ఉప సర్పంచ్‌లు, 1,739 మంది వార్డు సభ్యులను సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. పాలమూరును పూర్తి చేయని కేసీఆర్ కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని అన్యాయం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై పోరాడి ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని…ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో పాలమూరును పూర్తిగా ఎండబెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యాడని… ఆ తర్వాత సీఎం అయ్యారని కానీ పాలమూరు నీళ్లు మాత్రం తీసుకురాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లు కూడా పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.