పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలోని ఫిషింగ్ హార్బర్లకు కేంద్రప్రభుత్వం సాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా “చిప్ టు షిప్” విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై కేంద్రమంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. “చిప్ టు షిప్” విజన్‌కు అనుగుణంగా షిప్‌బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి సహకరించాలి ‘దుగరాజపట్నంలో నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం.ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు ఒప్పందం కుదిరింది’అని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.‘ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) సిద్ధమైంది. నౌక నిర్మాణానికి అనుబంధ MSME యూనిట్లు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వండి. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలి అని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఫిషింగ్ హార్బర్లకు కేంద్రం సాయం చేయాలి ఏపీలోని ఫిషింగ్ హార్బర్లకు కేంద్రప్రభుత్వం సాయం చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ‘ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని తెలిపారు.‘ఫేజ్–1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను రూ.1361.49 కోట్లతో చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని సీఎం వివరించారు. మిగిలిన మూడు హార్బర్లకు కేంద్ర సాయం ఇంకా అందలేదు అని సీఎం చెప్పుకొచ్చారు. ఫేజ్–1 పూర్తి కోసం ఇంకా రూ.440.91 కోట్లు అవసరం ఉందన్నారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద రూ.590.91 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌తో జరిగిన భేటీలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు ఉన్నారు.