జనం న్యూస్: ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం, భౌగోళిక రాజకీయాలు ఇకపై వేరుగా లేవని. ఆర్థిక అవగాహన, భౌగోళిక రాజకీయ ఆలోచనలను మిళితం చేసే దేశాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం, భౌగోళిక రాజకీయాలు ఇకపై వేరుగా లేవని. ఆర్థిక అవగాహన, భౌగోళిక రాజకీయ ఆలోచనలను మిళితం చేసే దేశాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ పేర్కొన్నారు. అటువంటి దేశాలలో భారతదేశం ఒకటి అనడంలో సందేహం లేదు. టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2025లో (India Economic Conclave 2025) వినీత్ జైన్ కీలక ప్రసంగం చేశారు. ఇది టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 11వ ఎడిషన్. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కాన్‌క్లేవ్. భారతదేశం ప్రపంచ భౌగోళిక ఆర్థిక క్రమాన్ని ఎలా పునర్నిర్మిస్తోందనే దానిపై చర్చించడానికి పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్, గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్‌లను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఈ వేదికపై నుంచి వినీత్ జైన్ మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ మార్పుల మధ్య భారతదేశం ఒక నిర్ణయాత్మకమైన, స్థిరమైన శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. భారతదేశం నమోదు చేసిన తాజా జీడీపీ గణాంకాలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మరోసారి నిరూపించాయని వినీత్ జైన్ అన్నారు. తయారీ రంగం, బలమైన ఆర్థిక పునాదులు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు ఈ వృద్ధికి మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. ‘‘నేటి ప్రపంచం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటమే కాకుండా. గతంలో కంటే పరస్పరం ఆధారపడి, పోటీతత్వంతో కూడుకుని ఉంటున్నాయి. ఇటువంటి సవాలుతో కూడిన వాతావరణంలో భారతదేశం బలమైన, సమతుల్య, భవిష్యత్తును చూసే శక్తిగా ఉద్భవించింది.అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం ఒక కీలకమైన చోదక శక్తి అని వినీత్ జైన్ అన్నారు.