ఉపాధి హామీకి కొత్త పేరు

*ఇక ' వీబీ జీ రామ్ జీ' ఏయే మార్పులు జరగనున్నాయంటే...

సాక్షి డిజిటల్ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ రోజ్‌గార్, వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G ) గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం’ (MGNREGA)ను రద్దుచేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G )గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. MGNREGA నుండి VB-G RAM G , పని దినాలు, కనీసం వేతనం పెంపు ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G )గా పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పథకంలో కొన్ని మార్పులు చేసారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఉన్న పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఇక ఉపాధి హామీ కూలీల వేతనాలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి రూ.1.51 లక్షల కోట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు 100 రోజుల పని దినాలు ఉండగా.. వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G ) పథకంగా చేసిన మార్పులో భాగంగా ఆ పనిదినాలను 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 1.51 లక్షల కోట్లు వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G ) పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామి పథకాన్ని 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రారభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రారంభించిన ఈ పథకం పేరును ఆ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *