నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా విశాఖ

*కాగ్నిజెంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు : కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ‘కాగ్నిజెంట్’ ద్వారా వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి దిశగా విశాఖపట్నం అడుగులు వేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా, ఐటీ–ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాగుతుందో ఇటీవలి కాలంలో జరుగుతున్న పెట్టుబడి సమీకరణలు స్పష్టంగా నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో ప్రారంభించిన ‘కాగ్నిజెంట్’ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థ సీఈఓ ప్రకటించడం రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణానికి నిదర్శనమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.13.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం…గతంలో పెట్టుబడులు ఆకర్షించగలగడం వల్ల విశాఖపట్నం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని కార్మిక శాక మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ నేపథ్యంలో అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పుకొచ్చారు.గత ప్రభుత్వ పాలనలో విశాఖను అభివృద్ధి కేంద్రంగా కాకుండా గంజాయి హబ్‌గా, ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చారని ఆరోపించారు. పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకున్నా.. అవి కాగితాలపైనే పరిమిత మయ్యాయని, ఫేక్ పెట్టుబడిదార్ల పేరుతో భూముల కేటాయింపుల ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుపై వేసిన అనేక అవినీతి కేసులు ఒక్కొక్కటిగా కోర్టుల్లో నిలబడకుండా కూలిపోతున్నాయని గుర్తుచేశారు.పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కోర్టు కోర్టుకు తిరుగుతూ అనేక పిటిషన్లు వేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రుషికొండపై నిర్మాణాల అంశం, ప్రజాధన వినియోగంపై ప్రజలు అన్ని గమనిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచలేదు మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్‌పై అసత్య ప్రచారం చేస్తూ కోటి సంతకాలు సేకరించడం రాజకీయ హాస్యాస్పద చర్యగా మారిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ ముఠా సూచించారు. ప్రజల తీర్పు స్పష్టమని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాలల్లో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారమే ఆయుధంగా చేసుకుందని, ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పులివెందుల కూడా గెలవడం కష్టమని హెచ్చరించారు. విద్యుత్ రంగంలో గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిన గత ప్రభుత్వం.. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *