భారత్ కు షాక్ ఇచ్చిన మెక్సికో

*ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 50 శాతం సుంకం పెంపు. *ఏ రంగానికి ఎదురు దెబ్బంటే..?

సాక్షి డిజిటల్ న్యూస్: అమెరికాతో సరిహద్దు పంచుకునే దేశం మెక్సికో ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50 శాతం వరకు టారిఫ్ ప్లాన్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు భారత్ తో పాటు చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులపై 50% వరకు టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ టారిఫ్ ప్లాన్ 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికా తరువాత ఇప్పుడు అదే కోవలో మరో దేశం కూడా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన భారీగా సుంకాలను విధించి వార్తల్లో ఎక్కింది. అమెరికాతో సరిహద్దు పంచుకునే దేశం మెక్సికో ఇప్పుడు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన 50 శాతం వరకు టారిఫ్ ప్లాన్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు భారత్ తో పాటు చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తులపై 50% వరకు టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ టారిఫ్ ప్లాన్ 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. సుంకాలు విధించిన వస్తువులు ఇవే. ఆటో పార్ట్స్ , కార్లు / లైట్ వెహికిల్స్, దుస్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టీల్, టెక్స్టైల్స్, హౌస్‌హోల్డ్ అప్లయన్సెస్, బొమ్మలు, ఫర్నిచర్, పాదరక్షలు (ఫుట్‌వేర్), అల్యూమినియం, మోటార్‌సైకిళ్లు, గ్లాస్, సబ్బులు, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ పైన ఈ సుంకాలు విధిస్తూ మెక్సికో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సుంకాలు ప్రత్యేకంగా ఏ దేశాలు అయితే మెక్సికోతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోలేదు ఆ దేశాలపై ఈ టారిఫ్లు వర్తిస్తాయని పేర్కొంది మెక్సికోతో ట్రేడ్ అగ్రిమెంట్ లేని దేశాల్లో ముఖ్యంగా భారత్ చైనా దక్షిణ కొరియా థాయిలాండ్ ఇండోనేషియా ప్రముఖంగా ఉన్నాయి. అయితే మెక్సికో ఈ టారిఫ్ ప్లాన్లను ప్రకటించడానికి ప్రధాన కారణం చైనా అని చెప్పవచ్చు. మెక్సికో అలాగే చైనా మధ్యలో భారీ స్థాయిలో వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించుకునేందుకే మెక్సికో ఈ నిర్ణయం తీసుకుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా శెయిన్‌బామ్ మాట్లాడుతూ ఈ టారిఫ్ ప్లాన్స్ వల్ల మెక్సికోకు అదనంగా 3.8 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపింది. అలాగే మెక్సికోలో స్థానికంగా లోకల్ పరిశ్రమలను కాపాడుకునేందుకు దోహదపడుతుందని కూడా ఆమె తెలిపారు. అయితే త్వరలోనే US–Mexico–Canada ఒప్పందం (USMCA) రివ్యూ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మెక్సికో తీసుకున్న ఈ టారిఫ్ ప్లాన్ ఆటోమొబైల్ పరిశ్రమపై భారీగా పడనుంది. ముఖ్యంగా భారత్ నుంచి మెక్సికో వెళ్లే 1 బిలియన్ విలువైన కార్ల ఎగుమతులు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎగుమతి చేసే కంపెనీలు: వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకి ప్రభావితం అవుతాయి. ప్రస్తుతం 20% సుంకం అమల్లో ఉండగా ఇది జనవరి 1 నుంచి 50%కి పెరుగనుంది ఇది భార‌త ఆటోమొబైల్ ఎగుమతులకు పెద్ద దెబ్బ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *