మూడో విడతలో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం

* తెలంగాణలో ఏకగ్రీవాల జోరు: మూడో విడతలో 394 సర్పంచ్‌లు!

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. కాగా, మొత్తం 12,723 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మూడో విడతలో 394 సర్పంచ్.. 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,752 స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో నిలిచారు. కాగా, తొలి విడతలో కూడా 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 414 మంది సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ప్రారంభమైంది. 189 మండలాల్లోని 3,834 సర్పంచ్.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇక డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 12,723 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవాలు అయ్యాయి, ఎంత మంది సర్పంచ్ రేసులో నిలుస్తున్నారనే విషయం తేలిపోయింది. 394 స్థానాలు ఏకగ్రీవం మూడో విడతలో భాగంగా మొత్తం 4,158 సర్పంచ్ స్థానాల్లో.. 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇక పలు కారణాల వల్ల 11 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో మిగిలిన 3,752 స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో నిలిచారు. కాగా, సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలు కూడా భారీగా ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతలో మొత్తం 36,434 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇందులో 7,916 స్థానాల్లో వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మిగిలిన 28,406 వార్డు స్థానాలకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. తొలి విడతలో కూడా. కాగా, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కూడా ఇదే స్థాయిలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 395 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఈ క్రమంలో మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాలకు సంబంధించి మొత్తం 12,960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడతకు సంబంధించి మొత్తం 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక రెండో విడతలో 414 మంది సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అంతేకాకుండా 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం.. రూ. 175 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు రూ.100 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ అధికారుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీవోల ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి. మిగిలిన రూ. 75 కోట్లను కూడా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోవని, మరో 50 కోట్ల వరకు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *