ఓయూ ప్రపంచానికి దిక్సూచిగా ఎదగాలి: ఓయూ సభలో సీఎం రేవంత్ రెడ్డి

*యూనివర్సిటీ నియామకాలు, నిర్ణయాల్లో పైరవీలు ఉండవు..

సాక్షి డిజిటల్ న్యూస్: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.108 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీల్లో 7 వ స్థానం, దక్షిణ భారత దేశంలో 3 వ ప్రాధాన్యత వర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలో నియామకాలు, నిర్ణయాల్లో ఎవరి పైరవీలు ఉండవు. రాజకీయ జోక్యం ఉండదు.పైరవీ చేసే వారి ఉద్యోగం తీసేద్దాం. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. పిల్లల జీవితంతో ఆటలాడే హక్కు ఎవరికీ లేదు. కావలసిన సహకారం అందించే బాధ్యత మాది’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను విడుదల చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్, డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గుండె నిండా అభిమానంతో యూనివర్సిటీకి వచ్చా ‘108 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీల్లో 7 వ స్థానం, దక్షిణ భారత దేశంలో 3 వ ప్రాధాన్యత కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అలనాటి స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునే క్రమంలో అందరినీ కలవాలని వచ్చాను’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘గుండె నిండా అభిమానంతో యూనివర్సిటీకి వచ్చా. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విశ్వవిద్యాలయ అభివృద్దికి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి వచ్చాను. ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చా’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సమాజానికి ఏ సమస్య వచ్చినా యూనివర్సిటీ విద్యార్థులు కదలడం వల్లే ఆ సమస్యకు పరిష్కారం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *