సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి నమోదైన గణాంకాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. స్థిర ధరల వద్ద నమోదైన ఆర్ధిక వృద్ధి, రాష్ట్రస్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలు ఇందులో ఉన్నాయి. విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయని… రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని వైసీపీపై విమర్శలు గుప్పించారు. గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ. 7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోందని అన్నారు. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. బ్రాండ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుందని… తద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయిందని తెలిపారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి అదాయం గరిష్టస్థాయిలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ తన ఆలోచన అని చెప్పారు. ప్రతి త్రైమాసిక, ఆర్థిక ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.