సాక్షి డిజిటల్ న్యూస్: OpenAI సంస్థ చాట్‌జీపీటీ కొత్త ఏఐ మోడల్ GPT-5.2 అందుబాటులోకి తేనుందని,డిసెంబర్ 9 నాటికి ప్రకటన రావచ్చని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. OpenAI సంస్థ ChatGPT తదుపరి ప్రధాన AI మోడల్ GPT-5.2 లాంచ్‌ను వేగవంతం చేస్తోందని , డిసెంబర్ 9 నాటికి ప్రకటన రావచ్చని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. Google కొత్తగా ప్రారంభించిన జెమిని 3 మోడల్‌కు పోటీగా దీనిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, OpenAI CEO సామ్ ఆల్ట్మాన్ ఇటీవల ఇంటర్నల్‌గా ‘కోడ్ రెడ్’ జారీ చేశారు, GPT-5.2 కోర్ పర్ఫామెన్స్‌ను పెంచడంపై పూర్తిగా దృష్టి పెట్టాలని టీమ్స్‌ను కోరారు. కొత్త ఫీచర్లను యాడ్ చేయడానికి బదులు, ప్రస్తుతం అత్యంత వేగం, ఖచ్చితత్వం , విశ్వసనీయతను మెరుగు పరచడంపై, గూగుల్ జెమిని 3 లో బాగా గుర్తింపు పొందిన అంశాలపై దృష్టి సారించాయని the Verge రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో గూగుల్, జెమిని 3 ను లాంచ్ చేసింది. ఇది యూజర్లను ఎంతో ఆకర్షించింది. ఎలాన్ మస్క్‌తో సహా ఇండస్ట్రీ నాయకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో OpenAI వ్యూహాత్మక పునరాలోచన చేసింది. GPT-5.2ని డిసెంబర్ చివరికల్లా లాంఛ్ చేసేందుకు ప్రయత్నించింది, అయితే ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చాట్ జీపీటీ-5.2, గూగుల్ లేటెస్ట్ ఏఐ మోడల్ కంటే బెటర్‌గా పనిచేస్తుందని, పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ లాంఛ్‌కు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచింది. డిసెంబర్ 9న దీనికి సంబందించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. గూగుల్ జెమిని 3 లాంఛ్ తర్వాత వచ్చిన రియాక్షన్, ఓపెన్ ఏఐ యొక్క కొత్త ఏఐ మోడల్ లాంఛింగ్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు, ఎలాన్ మస్క్ గ్రోక్ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఏఐ దిగ్గజాలకు పోటీగా గ్రోక్ కూడా అప్డేట్ కానుంది. ఏఐ మోడల్స్ అప్‌గ్రేడ్ కోసం గతంలో కంపెనీలు నెలల సమయం తీసుకునేవి, ఇప్పుడు మార్కెట్లో పోటీదారులు కొత్త మోడల్స్, వెంట వెంటనే రిలీజ్ చేస్తున్న తరుణంలో ఓపెన్ ఏఐ కూడా కేవలం వారాల్లో కొత్త మోడల్ రిలీజే చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.