అప్పటిలోగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా కొట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీనైనా ఢీ కొడుతానని… రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని అడగాడనికి వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, ఎవరితోనైనా కొట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీనైనా ఢీ కొడుతానని రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని… అడగాడనికి వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడనని చెప్పారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ. 532.24 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని చెప్పారు. ఒకటికి వంద సార్లు తిరుగుతానని, తనకు ఓపిక ఉందని అన్నారు. కాకతీయ కాలం నుంచి ప్రపంచానికి పోరాట పంథాను చాటిచెప్పిన వరంగల్ గడ్డ, సమ్మక్క- సారలమ్మ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణ రావు, పీవీ నర్సింహరావు గారి నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొ జయశంకర్ గార్లు ప్రజా ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. వారి స్ఫూర్తిగానే ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ‘‘నిరుపేదలు, దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన చదువులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తాతముత్తాల కాలం పది తరాలుగా వృత్తులు చేసుకుంటూ వచ్చినా బతుకులు మారలేదు. చదువొక్కటే మన బతుకుల్లో మార్పు తీసుకొస్తుంది. నిలబెడుతుంది. ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఒకవైపు రైతులు, మరోవైపు మహిళలు, ఇంకోవైపు యువత కోసం కార్యక్రమాలు చేపట్టింది. యువత కోసం ఉద్యోగ నియాకాలు చేపట్టాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోపే 61 వేల ఉద్యోగాలిచ్చాం. ఇంకా 40 వేల ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలవుతుంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ అత్యంత కీలకమని.. ఆయా రంగాల్లో లక్ష్యాలను సాధించడానికి ఈ నెల 8, 9, తేదీల్లో ప్రపంచ స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌తో సమంగా వరంగల్‌ను అభివృద్ధి చేయనున్నట్టుగా చెప్పారు. పక్క రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలుంటే, తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఉందని… పదేండ్లలో వీటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. డిసెంబర్ ఆఖరునాటికి భూ సేకరణ పూర్తి చేసి మార్చి 31 లోపు వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ‘‘హైదరాబాద్ తరహాలోనే వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క – సారలమ్మ మందిరం అద్భుతంగా నిర్మాణవుతోంది అదే తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రతి మారుమూల తండాకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో ఏ గ్రామానికీ రోడ్డు లేదన్న మాట వినదలచుకోలేదని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 20 వేల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసలు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు వేస్తున్నాం. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఉచిత బస్సు సౌకర్యం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, బస్సులకు యజమానులుగా.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ఇంటి ఆడబిడ్డకు చీరె పెట్టడం ఒక సంప్రదాయం. ఇంట్లో సొంత సోదరుడి తరహాలో ప్రతి ఏటా సారె పండుగ చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది ఆడబిడ్డలకు చీర అందిస్తున్నాం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరె చేరాలి. రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని అనొద్దు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయ్యాక, మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ, మున్సిపాలిటీల్లో చీరె అందజేస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 3.10 కోట్ల మంది బిడ్డలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై 13 వేల కోట్ల రూపాయల భారం అవుతున్నా పేదవారి ఆకలి తీర్చాలని, వారు కడుపునిండా భోజనం చేయాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *