జనం న్యూస్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీమంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎదుర్కోవడం తనకు కొత్తకాదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం తన రక్తంలోనే ఉందని మాజీమంత్రి దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.రాజీనామాపై తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం. పోరాడటం తనకేమీ కొత్త కాదు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం. పోరాడటం తనకేమీ కొత్త కాదని. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరో పదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. గెలవడం నా రక్తంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్‌గా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ గడువు కోరారు. ఈ క్రమంలో శుక్రవారం రాజీనామా అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని…ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. అనర్హత వేటు అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని. రేవంత్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. దానం రాజీనామాపై ప్రచారం. ఇదిలా ఉంటే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అనర్హత పిటీషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానం నాగేందర్‌కు నోటీసు జారీ చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో దానం నాగేందర్ చర్చలు జరుపుతున్నారు. లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమేనంటూ ప్రకటించారు.ఉప ఎన్నిక తరువాత కీలక పదవి పైనా దానం నాగేందర్‌కు హామీ లభించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. విచారణ జరిపితే చర్యలు తప్పవా? ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన దానం నాగేందర్ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు అంశంపై విచారణ జరిపితే దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోతారు. పార్టీ మారినందునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది పక్కా తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణ జరిపితే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అంతవరకూ వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం నాగేందర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామా అంశంపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం అని దానం నాగేందర్ ప్రకటించారు.