ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి

*చంద్రబాబు సర్కార్ అలర్ట్... *మందులు సిద్ధం, ల్యాబ్స్‌ల్లో పరీక్షలు పెంచేందుకు చర్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్క్రబ్ టైపస్ వ్యాధి వణికిస్తుంది. ఈ వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్క్రబ్ టైపస్ చికిత్సకు సంబంధించి మందులు సిద్ధం చేసింది. అలాగే ల్యాబ్స్‌లో పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్క్రబ్ టైఫస్ జ్వరాలవల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఇందుకు ప్రధానంగా అవసరమైన డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలు కోటి చొప్పున ఉప ఆరోగ్య కేంద్రాల(హెల్త్ అండ్ వెల్నెస్) స్థాయిలోనే అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. విజయవాడలో గురువారం సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన కమిషనర్ వీరపాండియన్ తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఓ మరణం స్క్రబ్ టైపస్ కారణంగా జరిగినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టింగ్ జరిగిందని, ఎలిశా పరీక్ష చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఈ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో ఏడు వీఆర్డీఏ ల్యాబ్లు ఉన్నాయని తెలిపారు. ఇవికాకుండా తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు, రీయేంజట్లను ఆసుపత్రులకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. నల్లమచ్చ కనిపించి జ్వరం వస్తే అప్రమత్తం కావాలి! 2023 నుంచి రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల నమోదు జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023లో 579, 2024లో 803 కేసులు, ఈ ఏడాది నవంబరు 30వ తేదీ వరకు 736 స్క్రబ్ టైపస్ కేసులు రికార్డయినట్లు వెల్లడించారు.‘వర్షాకాలంలో ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరం, తలనొప్పితోపాటు శరీరంపై కీటకం కుట్టిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిన చిగ్గర్ మైటు అనే కీటకం మనుషులను కుడుతుంది. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు మనుషులను కుట్టడంవల్ల స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది’ అని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. కావిడ్లో మాదిరిగానే దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివపించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను కుడుతుంటాయి పొలం పనులకు వెళ్లే వారు రబ్బరుతో తయారుచేసే షూలు ధరిస్తే మంచిది. నివాస పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలిఅ’అని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వివరించారు. సీఎం చంద్రబాబు అలర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్క్రబ్ టైఫస్ కేసుల పెరుగుదలతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే స్క్రబ్ టైఫస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రోజున సచివాయంలో స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో సమీక్ష నిర్వహించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి చందక రాజేశ్వరి మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడంవల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ వ్యాధిని ఏవిధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని చెప్పారు. అయితే ఈ సందర్భంగా చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబుకు సౌరభ్ గౌర్ వివరించారు. ‘‘విజయనగరానికి చెందిన రాజేశ్వరీ అనే మహిళను చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, అయితే ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారు. తర్వాత రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయారు’’ అని సీఎం చంద్రబాబుకు సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు స్పందిస్తూ… స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటివల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *