కైలాసగిరి గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి ఓపెనింగ్‌కు రెడీ

*దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ఇవే, ప్రత్యేకతలు ఇలా

సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖపట్నంలోని ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ కైలాసగరి వద్ద మరో ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులను అలరించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… విశాఖపట్నంలోని ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ కైలాసగరి వద్ద మరో ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులను అలరించనుంది. కైలాసగిరిపై నిర్మించి గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్దమైంది. దేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్‌గా చెబుతున్న ఈ వంతెనను డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వీఎంఆర్‌డీఏ వెల్లడించింది. కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్‌ను సోమవారం (డిసెంబర్ 1) రోజున స్థానిక ఎంపీ శ్రీభరత్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నట్టుగా వీఎంఆర్‌డీఏ తెలిపింది. ఇప్పటిరకు కేరళలో 40 మీటర్ల పొడువున్న గ్లాజ్ బ్రిడ్జి… దేశంలో పొడవైన గ్లాస్ బ్రిడ్జి‌గా గుర్తింపు పొందిందని తెలిపింది. అయితే ఇప్పుడు విశాఖ కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ దానిని అధిగమించిదని పేర్కొంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ), ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేపపట్టారు. ఈ గ్లాస్ బ్రిడ్జి పొడువు 55 మీటర్లు. ఇందుకోసం జర్మనీ నుంచి గ్లాస్ తీసుకొచ్చారు. ఈ నిర్మాణం ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (FRP) ఉపయోగించి చేపట్టారు.దీని తేలికైన, వాతావరణ నిరోధక, మన్నికైన లక్షణాలు తీరప్రాంత గాలులను తట్టుకుని నిలబడేందుకు వీలు కల్పిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఈ నిర్మాణం… 250 కి.మీ వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జి నుంచి… బంగాళాఖాతం, తూర్పు కనుమలతో పాటు విశాఖనగర అద్భుతమైన అందాలను వీక్షించనున్నారు. ఈ బ్రిడ్జి ఒకేసారి 100 మందిని తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఒకేసారి 500 టన్నుల భారం మోయగలదని చెబుతున్నారు. అధికారులు ప్రారంభంలో పర్యాటకుల సౌకర్యం, భద్రతను కోసం బ్యాచ్‌కు 40 మంది సందర్శకులను అనుమతించనున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యాల పలుమార్లు పరిశీలించినట్టుగా వీఎంఆర్‌డీఏ తెలిపింది. ఈ బ్రిడ్జిని రాత్రిపూట త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసేలా తీర్చిదిద్దింది. విశాఖవాసులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ గ్లాస్ బ్రిడ్జి ప్రధాన ఆకర్షణగా మారుతుందని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *