భారత్‌కు శుభవార్త చెప్పిన రష్యా

*వ్లాదిమిర్ పుతిన్ పర్యటన వేళ.. *భారత్, రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు *పుతిన్‌ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి మోదీ *న్యూఢిల్లీతో సైనిక ఒప్పందానికి మాస్కో ఆమోదం

సాక్షి డిజిటల్ న్యూస్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాకతో న్యూఢిల్లీలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సుపై ప్రపంచం దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇదే కావడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్-రష్యా సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించడం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. న్యూఢిల్లీ వేదికగా వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు కారణం నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానుండగా.. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన అనంతరం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాదు, రష్యా నుంచి నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు సుంకాలు విధించిన నేపథ్యంలో మాస్కో అధినేత భారత పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబరు 4,5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, పుతిన్ పర్యటనకు ముందు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని మాస్కో పార్లమెంట్‌లో ఆమోదం తెలుపనున్నటు తెలుస్తోంది. అధికార వర్గాలు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఒప్పందంతో భారత్‌- రష్యాల మధ్య సైనిక సహకారం మరింత బలోపేతం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న భారత్‌- రష్యాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఆ దేశ రక్షణ మంత్రి అలెగ్జాండర్‌ ఫోమిన్‌, రష్యాలో భారత రాయబారి వినయ్‌ కుమార్‌లు ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ దేశ పార్లమెంట్ డుమా తన రాటిఫికేషన్ డేటాబేస్‌లో రష్యా ప్రభుత్వ నోట్‌తో పాటు RELOSను అప్‌లోడ్ చేసింది. ‘ఈ ఒప్పందం ఆమోదం సైనిక రంగంలో రష్యా, భారతదేశం మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని రష్యా ప్రభుత్వం విశ్వసిస్తుంది’ అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *