ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

*బర్త్ సర్టిఫికేట్‌గా ఆధార్‌ చెల్లదు

జనం న్యూస్‌: భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్‌ను జనన ధృవీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా ఇకపై అంగీకరించబోమని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. పిల్లల స్కూల్ అడ్మిషన్, ప్రభుత్వ పథకాలు ఇలా నిత్యం వివిధ సందర్భాల్లో ఆధార్‌ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నాం. ఫోటో గుర్తింపు, అడ్రస్, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం చాలా సందర్భాల్లో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్‌ను రుజువుగా పరిగణిస్తున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌ ఆధార్ గుర్తింపు కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ను జనన ధృవీకరణ కోసం డాక్యుమెంట్‌గా పరిగణించరు ఆధార్‌ను జనన ధృవీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా ఇకపై అంగీకరించబోమని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. ఆధార్‌తో లింక్ చేయబడిన జనన రికార్డు లేదని ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని రాష్ట్ర విభాగాలకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 28, శుక్రవారం రోజున ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆధార్ కార్డు జనన ధృవీకరణ పత్రంగా పనిచేయదని ఉత్తరప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది ఎందుకంటే దానికి జనన రికార్డులు అనుసంధానించబడలేదు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి జిల్లాలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో సహా అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్రలలో ఆధార్ కార్డులను ఇకపై జనన ధృవీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా అంగీకరించరు. “ఆధార్ కార్డులో ఎటువంటి ధృవీకరించబడిన జనన వివరాలు లేవు; కాబట్టి, దీనిని జనన ధృవీకరణ పత్రంగా పరిగణించలేము” అని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఆధార్‌ను జనన లేదా పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా అంగీకరించడం మానేయాలని ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని రాష్ట్ర విభాగాలను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *