సాక్షి డిజిటల్ న్యూస్: విశాఖపట్నం ప్రస్తుతం ఐటీ హబ్ అయ్యేందుకు కూడా సిద్ధం అవుతుంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ డేటా సెంటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ కనుక పూర్తయినట్లయితే, విశాఖపట్నం ఒక గ్లోబల్ డెస్టినేషన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖపట్నం అనేది ఒక ప్రధానమైన కేంద్ర స్థానంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖపట్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం రెండవ అతిపెద్ద మహానగరం గా ఉండేది. దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హగ్గుగా అతిపెద్ద ఓడరేవుల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్నటువంటి విశాఖ, రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద మహానగరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అసెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. విశాఖపట్నం అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పవచ్చు. విశాఖను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయినటువంటి రెవెన్యూ ను భర్తీ చేసుకోవాలని ఒక పెద్ద ప్రణాళికతో పనిచేస్తుంది అని చెప్పవచ్చు. నిజానికి విశాఖపట్నం కేంద్రంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా గమనించినట్లయితే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను చూడవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ఓడరేవు, ఎన్ టి పి సి, డ్రెడ్జింగ్ కార్పోరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా పలు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక భారత నౌకా దళానికి కూడా విశాఖపట్నం ఒక కేంద్ర స్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అత్యంత వేగంగా విస్తరించడానికి అన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నాయి అని చెప్పవచ్చు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా అత్యంత వేగంగా విస్తరించడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో భూముల ధరలు ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే నెమ్మదిగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. విశాఖపట్నం ప్రస్తుతం ఐటీ హబ్ అయ్యేందుకు కూడా సిద్ధం అవుతుంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ డేటా సెంటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ కనుక పూర్తయినట్లయితే, విశాఖపట్నం ఒక గ్లోబల్ డెస్టినేషన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధురవాడ నుండి అనకాపల్లి వరకు ఉన్న కోస్టల్ కారిడార్ పలు ప్రాంతాల్లో డేటా సెంటర్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాలని సముద్రానికి దగ్గరగా ఉండటంతో పాటు అండర్ సీకేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. త్వరలోనే విశాఖ ఒక డేటా సెంటర్ కనిపిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడ, కాపులుప్పాడ, పరదేశి పాలెం, తరలు వాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని వీటికి కేంద్రంగా రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది.