భారత్ ఖాతాలో మరో వరల్డ్ కప్!

* అంధుల మహిళా ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా...

సాక్షి డిజిటల్ న్యూస్: నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి, అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత మహిళా జట్టుభారత జట్టు ఖాతాలో మరో ప్రపంచ కప్ చేరింది. మొట్టమొదటి అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల అంధుల జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత అంధుల మహిళ జట్టు 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత మహిళల అంధుల జట్టు.. పుల సరెన్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన అంధుల టీమ్స్ పాల్గొన్నాయి. అసలు అంధులు క్రికెట్ ఎలా ఆడతారు? అంధుల క్రికెట్ కోసం తెల్లని ప్లాస్టిక్ బాల్ ఉపయోగిస్తారు. ఈ బంతికి బాల్ బేరింగ్స్‌ పెడతారు. దీని వల్ల బాల్ దొర్లినప్పుడు చప్పుడు వస్తుంది. సాధారణ క్రికెట్ మాదిరిగా కాకుండా ఇందులో బంతికి అండర్ ఆర్మ్ త్రో వేస్తారు. బంతి దొర్లుతూ వస్తున్నప్పుడు ఆ చప్పుడుని బట్టి, బ్యాటుతో కొడతారు… అంధుల జట్టులో అందరూ పూర్తిగా అంధులు కానవసరం లేదు. కానీ జట్టులో కచ్ఛితంగా నలుగురు పూర్తిగా అంధులు ఉండాలి. మిగిలిన వారిలో పాక్షికంగా అంధత్వం ఉన్నవాళ్లు కూడా ఉండొచ్చు. కంటిచూపుని బట్టి వారి కేటగిరీ డిసైడ్ చేస్తారు. ఒకవేళ కంటిచూపు కొంతవరకూ సరిగ్గా ఉన్నవాళ్లు, అంధులతో క్రికెట్ ఆడాలంటే కళ్లకి నళ్లని గంతలు కట్టుకుని ఆడాల్సి ఉంటుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *