ఈనెల 24న కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!

పయనించే సూర్యుడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రైతులను లాభసాటిగా మార్చేందుకు పంచసూత్రాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 నుంచి రైతన్నా మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. వ్యవసాయంలో పంచ సూత్రాలపై ఏడు రోజులపాటు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుల కోసం పంచసూత్రాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది.ఈనెల 24 నుంచి రైతన్నా…మీకోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయడు స్వయంగా ప్రకటించారు.వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 10 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది.ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది.24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు.డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు.

పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపడుతున్నాం :

అన్నదాతల సంక్షేమం కోసం,సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖలకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మీకోసం రైతన్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనుంది. ఈ సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు ముందుకెళ్తున్నాం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశాం. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించాం. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి :

‘నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టాం. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పించాలి.ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతో పాటు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యం… అగ్రిటెక్ విధానాలతో కలిగే లాభాలు వివరించాలి ‘రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలి.కడపలో ప్రకృతి సాగును కూడా పరిశీలించాను. ఆ సాగు రైతులు చాలా సంతృప్తిగా ఉన్నాయి. ప్రైవేట్ ఎరువుల షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లోని ఎరువుల ధర తక్కువగా ఉంది’సీఎం చంద్రబాబు నాయుుడు చెప్పుకొచ్చారు.

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి :

‘రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రైతుల ఏ పంటలు సాగు చేశారు… వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి’సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను, సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించాలి. పూర్తి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా రిజర్వాయర్లను నింపగలిగాం. అలాగే సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *