
సాక్షి డిజిటల్ న్యూస్ : ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం అని చెప్పుకొచ్చారు. మా జోలికి వచ్చినవారిని వదిలిపెట్టం అని డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు అని సూచించారు. ప్రపంచంలో అమెరికా సైన్యం అత్యంత శక్తిమంతమైనదని...ఆ సైన్యాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. తమ జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టం అని అన్నారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఆ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ ప్రముఖ ఛానెల్లో సోమవారం మాట్లాడారు. తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదని ట్రంప్ హెచ్చరించారు. త్వరలో మరిన్ని తీవ్ర దాడులు ఉంటాయని...ప్రజలంతా సురక్షితంగా ఉండాలని...వారు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇరాన్‌పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని... దానిని ఇప్పుడు ఉపయోగిస్తు న్నామని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా తమకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సాగుతోందని చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందేందుకే అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించింది అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఇరాన్‌పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని...ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో దాడులు ఇకపోతే ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది.‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’పేరుతో ఇరాన్‌పై యుద్ధభేరి మోగించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇరాన్‌లోని 1000కి పైగా కీలక లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై వైమానిక, గగనతలం, సముద్రం, సైబర్, మరియు అంతరిక్ష (స్పేస్)లతో విరుచుకుపడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఖండాతరాల నుంచి వచ్చిన వేలాది మంది సైనికులు, భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, అత్యాధునిక బాంబర్లు ఈ దాడిలో పాల్గొన్నాయి అని పేర్కొంది. భూమి, సముద్రం, ఆకాశం నుంచే కాకుండా అంతరిక్షం నుంచి కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచినట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కేన్ వెల్లడించారు. దాడి ప్రారంభమైన మొదటి దశలోనే వందలాది విమానాలు, యుద్ధ నౌకలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు ఇరాన్‌పై ఏకకాలంలో విరుచుకుపడ్డాయి అని తెలిపారు. ఈ దాడికి ముందు గత 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో అమెరికా తన బలగాలను వ్యూహాత్మకంగా మోహరిస్తూ వచ్చిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కేన్ పేర్కొన్నారు.