
పయనించే సూర్యుడు న్యూస్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రకు మహర్ధశ పట్టింది. ప్రముఖ కంపెనీలు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఉత్తరాంధ్రలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుండగా తాజాగా మరో భారీ ఔషధ కంపెనీ బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీకి భూమి పూజ పనులను మంత్రి నారా లోకేశ్ చేశారు. 2029 కల్లా ఈ కంపెనీ తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఉత్తరాంధ్రకు మహర్థశపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రకు భారీ కంపెనీలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కంపెనీలు తమ పనులు శరవేగంగా ప్రారంభించాయి. ఇలాంటి తరుణంలో ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ తరలిరానుంది.అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ బ్లూజెట్ పరిశ్రమను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ రాష్ట్రంలో రూ.2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.ఈ కంపెనీ ద్వారా 1750 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఉత్తరాంధ్రకు భారీ ఔషధ తయారీ కంపెనీ బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక ఐటీ, ఫార్మా కంపెనీల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు మరో భారీ ఔషధ తయారీ కంపెనీ రానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ (Blue Jet Healthcare Limited (BJHL) పరిశ్రమకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి సెజ్ లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటుచేస్తుంది. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్.. శాస్త్ర ఆధారిత ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ పదార్థాల రంగంలో ప్రఖ్యాత సంస్థగా పేరుగడించింది. రూ.2,300 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉద్యోగాల కల్పన జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకోసం కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్.చింతువ రెవెన్యూ పరిధి సీతపాలెం వద్ద సెజ్‌లో రెండో విడతగా సేకరించిన భూముల్లో 102.48 ఎకరాలను కేటాయించింది. ఎకరా రూ.40 లక్షలకు కేటాయించడంతో పాటు అదనపు ప్రోత్సహకాలు మంజూరు చేసింది. రూ.2,300 కోట్ల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమను దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరానికి సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఈ పెట్టుబడి స్థానిక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని అధునాతన ఫార్మాస్యూటికల్ తయారీకి కీలక గమ్యస్థానంగా మార్చడంలో దోహదపడనుంది.