
సాక్షిడిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుగా కూటమి ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుగా కూటమి ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన పాపాన్ని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చుట్టడం సీఎం చంద్రబాబుకు భావ్యం కాదని అన్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. వైసీపీ కల్తీ పనులు నాటి వైఎస్సార్ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదని అన్నారు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దివంగత వైఎస్సార్‌కు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల 7 కొండలను 2 కొండలు చేయాలని వైఎస్సార్ ఏనాడూ అనుకోలేదని అన్నారు. వైఎస్సార్ అన్నారని జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసిందే చంద్రబాబు అని ఆరోపించారు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు వైఎస్సారేనని అన్నారు. ఏడుకొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత జీవో ఇచ్చి వైఎస్సార్ చరిత్ర సృష్టించారని అన్నారు.