మల్లారెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

జనం న్యూస్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీడిమెట్లలో భూ సర్వే వ్యవహారంలపై మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి‌లు సుప్రీం కోర్టును ఆశ్రయంచగా వారికి ఊరట దక్కలేదు. భూ సర్వే వివాదంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ పూర్తయిందని ఆయన అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలో 1.29 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. ఇందులో కొన్ని భాగాలను పలువురు క్లెయిమ్ చేస్తున్నారు. సర్వే నం 82/1/ఈఈలో భాగమైన 33 గుంటల విస్తీర్ణంలోని భూమి హద్దులు నిర్ణయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ శేరి శ్రీనివాస్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ వివాదస్పద భూమిలో సర్వే నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సర్వే ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే సర్వే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ద దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే పూర్తయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకునేందుకు తాము ఇష్టపడటం లేదని కోర్టు తెలిపింది. సర్వే, సెటిల్‌మెంట్ చట్టం నిబంధనల ప్రకారం సర్వే ప్రక్రియలు నిర్వహించకపోతే సర్వే ప్రక్రియలను సవాలు చేసే స్వేచ్ఛను మల్లారెడ్డి కుటుంబానికి సుప్రీం కోర్టు మంజూరు చేసింది. అలాగే మల్లారెడ్డి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగించింది.