పసిపాప ప్రాణం తీసిన కుల గర్వం

అమ్మ పొత్తిళ్లలో ఒదిగే వయసు ఆకలైతే ఏడవడమే తెలిసిన మనసును ఏ కులమని చూశావు
కాలితో ఎలా తన్నావు రెండు నెలల పసిగుడ్డు ప్రాణాన్ని ఎలా తీశావు ఓ నర రూప రాక్షసుడా…. నీ రక్తంలో ప్రవహించేది అహంకారపు విషమా అగ్ర కులమన్న మధమా లేక మనిషి రూపంలో ఉన్న మృగపు నైజమా

గుడి మెట్లు తడిశాయిరా ఆ పసిపాప రక్తంతో అలమటించి పోయిందిరా ఆ కన్న పేగు శోకంతో దేవుడే విలపించాడురా నీలోని క్రూరత్వంతో… చీ.. కులమనే పిచ్చితో పసికందును చిదిమేశావు సభ్య సమాజం తలదించుకునేలా చేశావు నీ బతుకుకి అర్ధం ఉందా బరితెగించిన బలుపుని తీయకుండ ఊరుకుంటుందా.. సమాజం!!

కళ్ళు తెరువని  పసిపాప నీ కాలి కింద నలిగింది కనికరమే మరిచింది కరుణే కృరమైంది మానవత్వమే మంట కలిసింది నీ మదముతో నేడు కుప్పకూలింది

కులం నీ తలకెక్కిన మదం అయితే పసి పాప ప్రాణానికి సరైన న్యాయం జరగాలి మరణం నీ పాపానికి సరైన తీర్పు కావాలి న్యాయం కోసం రక్తం మరగాలి ధర్మ వ్యవస్థ కుల పిచ్చి కొడుకులకు యమపాశం కావాలి
నీలాంటి దుష్టుల కుల అహంకారపు కోరలు పీకేయాలి ఉరికొయ్యే శరణ్యం కావాలి.

మీ… నరిగె కళాశేఖర్ రచయిత, జానపద కళాకారులు పయనించే సూర్యుడు, రాజాపూర్ మండలం రిపోర్టర్ మహబూబ్ నగర్ జిల్లా 98858 76797