దేశంలో తొలి హైస్పీడ్ మెట్రో ప్రారంభం.

*నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంచ్

సాక్షిడిజిటల్ న్యూస్ : తొలి హైస్పీడ్ మెట్రో రైలు ఢిల్లీ-మీరట్ కారిడార్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం 82 కి.మీ. ర్యాపిడ్ రైల్ కారిడార్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఢిల్లీ, మీరట్ మధ్య సమయాన్ని దాదాపు 55 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ కారిడార్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా నమో భారత్ రైలును ఎక్కే సదుుపాయం ఈ కారిడార్‌లో ఉంది. దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో రైలు సర్వీస్‌ను ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ మధ్య 82 కిలోమీటర్ల ర్యాపిడ్ రైల్ కారిడార్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఇక, 120 కి.మీ. వేగంతో నడిచే మీరట్ మెట్రో భారత్‌లో అత్యంత వేగవంతమైన వ్యవస్థగా అవతరించింది. ఈ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 55 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని సారాయ్ కలే ఖాన్ నుంచి యూపీలోని మోదీపురం వరకు మొత్తం 82.15 కి.మీ. పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ నమో భారత్ కారిడార్ దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ రవాణా వ్యవస్థ. ప్రస్తుతం ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్ మధ్య 5-కి.మీ… ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సౌత్, మోదీ పురం మధ్య 21 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక మొత్తం 23 కి.మీ. పొడవైన మెట్రో మీరట్ నగర లోపలే నడుస్తుంది. మీరట్ విభాగంలో నమో భారత్ రాపిడ్ రైలుతో ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలను అనుసంధానమై ఉంటాయి. దంతో ప్రయాణీకులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లకుండానే మారడానికి అనుమతిస్తుంది. దీనిని గంటకు 135 కి.మీ.. వేగంతో డిజైన్ చేయగా.. గరిష్ఠ వేగం 120 కి.మీ. 21 కి.మీ. కారిడార్‌‌లో ప్రయాణానికి అరగంట పడుతుంది. 23 కి.మీ. కారిడార్‌లో 16 కి.మీ. ఎలివేటెడ్ ట్రాక్, 7 కి.మీ. సొరంగంలో ప్రయాణిస్తుంది. మొత్తం 13 స్టేషన్లు ఉండగా.. ఇందులో 9 ఎలివేటెడ్ కారిడార్‌లో ఉన్నాయి. ఒకే టిక్కెట్‌పై నమో భారత్, మీరట్ మెట్రోలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. మీరట్ మెట్రో:రైళ్లు మూడు కోచ్ సెట్లు, ఒక్కోసారి 700 కంటే ఎక్కువ మంది ప్రయాణించే వీలుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *