చివరిచూపు కూడా దక్కలేదని కేటీఆర్ వ్యాఖ్య

* ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విమర్శలు.

జనం న్యూస్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర ఏడాది క్రితం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతు అయ్యారు. ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్న నేటికి వారి ఆచూకీ లభ్యమవ్వకపోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అని కేటీఆర్ మండిపడ్డారు. గతేడాది ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది గల్లంతు అయినా ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియకపోవడంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసింది అని మండిపడ్డారు. సంవత్సరం గడుస్తున్న మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని కేటీఆర్ హితవు పలికారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర భారీ ప్రమాదం ఇకపోతే గతేడాది శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర భారీ ప్రమాదం జరిగింది.దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్‌లో 50 మంది ఉండగా వారిలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. 8 మంది గల్లంతయ్యారు. గాయపడిన 42 మందిని ఆస్పత్రికి తరలించగా కోలుకున్నారు. అయితే గల్లంతైన 8మంది కోసం గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు. ఇకపోతే గల్లంతైన కార్మికులు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ చెందిన వారన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *