హైదరాబాద్‌లో పేలుడు ఘటన

★ నలుగురికి తీవ్ర గాయాలు.

జనం న్యూస్: హైదరాబాద్‍లో భారీ పేలుడు సంభవించింది.ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‍లోఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో స్టీమర్ పేలడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదం ఘటన మరువకముందే మరో భారీ పేలుడు సంభవించింది. ఉదయం కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం జరిగితే ఇక్కడ ఓ హోటల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటన ఎల్బీనగర్‌లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్‌లో జరిగింది. ఆర్కేపురం చట్నీస్ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. అధిక వేడి కారణంగా ఇడ్లీ స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటు చోసుకోవడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తోటి సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్‌ను పరిశీలించాయి. క్షతగాత్రులంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు పక్కన ఉన్న చట్నీస్ హోటల్ కిచెన్‌లో ఇడ్లీ తయారు చేసే స్టీమర్ పేలిపోయింది.సుమారు మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇడ్లీ స్టీమర్ పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వంటగదిలో పని చేస్తున్న నలుగురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీమర్‌లోని వేడి నీళ్లు వారిపై పడటంతో శరీరాలు తీవ్రంగా కాలినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారుగా తెలుస్తోంది. గోప్యంగా ఉంచే ప్రయత్నం ! మరోవైపు ఈ ప్రమాదాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చట్నీస్ యాజమాన్యం బయటి వ్యక్తులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్ షట్టర్లు దించి, జరిగిన విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారంటూ మండిపడుతున్నారు. కస్టమర్ల భద్రత కంటే హోటల్ ప్రతిష్టకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి..సాక్ష్యాలను సేకరించారు. స్టీమర్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలితే చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు.