పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీలో గ్రామ పంచాయతీలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా వేగవంతం చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచులకు తీపికబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 5న తీర్మానాలు చేయగా.. వాటికి అనుగుణంగా నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయతీలకు సంబంధించిన పనులు చేసి, మెజర్‌మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని ప్రభుత్వం తెలిపింది. నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులవినియోగానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో పూర్తయిన పనులకు ఆర్థిక సంఘం నిధుల చెల్లింపులు చేయనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ.. రాష్ట్రంలో పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు పూర్తి చేసి ఎం.బుక్‌లో నమోదైన వాటికి చెల్లింపులు చేయాలని ఆదేశాలిచ్చినట్లు రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ‘గ్రామాల్లో చెత్త కుప్పలు తొలగించేందుకు ఉద్దేశించిన శానిటేషన్ డ్రైవ్ పనులతోపాటు ఇప్పటికే పూర్తి చేసిన ఇతర పనులకూ బిల్లులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు’ అని చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వెనుకబడిన వర్గాల డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలో ఈ డెడికేటెడ్ కమిషన్‌ను నియమించారు. ఈ డెడికేటెడ్ కమిషన్.. స్థానికసంస్థల వారీగా బీసీల స్థితిగతులు, స్వరూపంతో పాటుగా ఆయా అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. 45 రోజుల్లో ప్రతి స్థానిక సంస్థకు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయిస్తూ సమగ్ర నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీల కోసం రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల కోసం డెడికేటెడ్ కమిషన్ నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.