జనం న్యూస్: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ ఎన్నికపై వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ ఎన్నికపై వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టి తెలంగాణ హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో 21 వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిలుకల బుగ్గ రాములు విజయం సాధించారు. అయితే బుగ్గ రాములు ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుగ్గ రాములు మూడు వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారని ఆరోపిస్తూ ఈగల రాములు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీలో ఒకటి, మున్సిపాలిటీలో మరో ఓటరు గుర్తింపు కార్డు ఉన్న చిలకల బుగ్గ రాములు నామినేషన్‌ను ఆమోదించడాన్ని సవాలు చేశారు. ఇందుకు సంబంధించి గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ కమిషనర్, తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్, రంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ రిటర్నింగ్ అధికారికి తాను ఫిర్యాదును సమర్పించానని చెప్పారు. అయితే ఈ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోవడం రాజ్యాంగంలోకి ఆర్టికల్ 14, 21 నిబంధనల ఉల్లంఘననే అన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ఒక ఓటరుకు ఒక ఓటరు ఫోటో గుర్తింపు కార్డు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. ఈ విషయంలో సూచనలు పొందాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు స్టాండింగ్ కౌన్సిల్‌ను జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ ఆదేశించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులైన కలెక్టర్, ఆర్డీవో, కౌన్సిలర్ బుగ్గ రాములకు నోటీసులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.