రాజకీయాల్లో కీలక పరిణామం

★ కవిత స్వతంత్ర పార్టీ ప్రకటనకు సన్నాహాలు.

జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మే నెలలో కొత్త పార్టీ ప్రకటన, విధి విధానాలు వెల్లడించనున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకోనుంది.త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ (BRS) పార్టీకి దూరంగా ఉంటూ, సొంత బాటను ఎంచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేయడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఒకే కుటుంబంలో రెండు పార్టీలు ఉంటే ప్రజలు ఆ పార్టీలను ఎలా స్వాగతిస్తారు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్. కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు ఓపెన్ అయిపోయారు. కొత్త పార్టీ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత అధికారికంగా ప్రకటించేశారు.అంతేకాదు కొత్త పార్టీ పేరుపై కూడా పలు హింట్ ఇచ్చారు. తమ పార్టీ పేరులో ఖచ్చితంగా ‘తెలంగాణ’ అనే పదం ఖచ్చితంగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.రాష్ట్ర అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తన కొత్త పార్టీ పేరు ఉండబోతుంది అని కవిత స్పష్టం చేశారు. అంతేకాదు తన పార్టీ తరఫునే 2028 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించేశారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేయోచ్చు అని తెలిపారు. అయితే తన ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట, సెకండ్ ఛాయిస్ బోధన్‌ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. వికలాంగులకు ఉచిత బస్సుసౌకర్యం కల్పించాలి. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను కర్ణాటకలోని దావణగెరెకు తరలించి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.