AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో సంచలనం

★చైనా రోబోను తమదే అని చెప్పిన యూనివర్సిటీ

పయనించేసూర్యుడు :‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ కార్యక్రమంలో గల్గోటియాస్ యూనివర్శిటీ ప్రదర్శించిన రోబోటిక్ డాగ్ వివాదాస్పదమైంది. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ కార్యక్రమంలో గల్గోటియాస్ యూనివర్శిటీ ప్రదర్శించిన ఒక రోబోటిక్ డాగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓరియన్ అనే పేరుగల రోబోను తమ యూనివర్సిటిలో అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,ఆ రోబో గల్గోటియాస్ తయారు చేసింది కాదని చైనాకు చెందినదనే వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే.... ఢిల్లీ వేదికగా మూడు రోజుల పాటు ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ జరుగుతోంది. అయితే ఈ సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్శిటీ ఒక రోబోటిక్ డాగ్ ను ప్రదర్శించారు. ‘ఓరియన్’ అనే పేరు గల రోబోను తమ యూనివర్శిటీలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ లో స్వయంగా అభివృద్ధి చేసినట్లు గర్వంగా ప్రకటించారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అయితే "ఓరియన్" పేరుతో ఆన్‌లైన్‌లో దాదాపు రూ. 2–3 లక్షలకు అమ్ముడైన ఏఐ-బేస్డ్ చైనీస్ రోబోడాగ్ Unitree Go2ని ప్రదర్శించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది, దీంతో ఆ విశ్వవిద్యాలయం విమర్శలకు గురైంది. ఈ వివాదం తర్వాత ఆ యూనివర్సిటీని ఏఐ సమ్మిట్ ఎక్స్‌పో నుండి పంపించినట్లు సమచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అవుతున్న వీడియోలో,గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంస్థ పెట్టుబడి గురించి , రోబోటిక్ డాగ్ గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది. ఓరియన్ పేరుతో పిలిచే ఆ రోబోడాగ్‌ను తామే రూపొందించినట్లు పేర్కొన్నారు. "ఇది ఓరియన్, దీనిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసింది" అని ఆమె చెప్పింది. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో రూ. 350 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్న మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ మాది, మాకు క్యాంపస్‌లో ప్రత్యేక డేటా సైన్స్ , AI బ్లాక్ ఉంది" అని ఆమె తెలిపారు. ఈ రోబోను క్యాంపస్‌లో నిఘా పనుల కోసం ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపించిన రోబో గల్గోటియాస్ తయారు చేసింది కాదని చైనాకు చెందిన Unitree Robotics కంపెనీ తయారు చేసిన Unitree Go2 మోడల్ అని పలు నిపుణులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.