జనం న్యూస్: దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఫిబ్రవరి 26న నోటిఫకేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో వరుస ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సైతం పూర్తయ్యాయి. త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది.తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీకాలం పూర్తి కానున్నాయి.ఈ నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల. తెలంగాణలోని రెండు స్థానాలతో పాటు 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకుఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇకపోతే మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు దేశవ్యాప్తంగా 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్‌గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి గడువు కాగా మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ముఖ్యమైన సమాచారం. రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 26, నామినేషన్ దాఖలకు చివరితేదీ: మార్చి 5, నామినేషన్ల పరిశీలన: మార్చి 6, నామినేషన్ విత్ డ్రా : మార్చి 9, పోలింగ్: మార్చి 16న(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) కౌంటింగ్: మార్చి 16న సాయంత్రం 5 గంటల తర్వాత, 2024లో రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ సింఘ్వీ, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏఐసీసీ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టు 27న జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కేకే గుడ్ బై చెప్పిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ఆగస్టు 19న నామినేషన్ వేశారు.