
పయనించే సూర్యుడు న్యూస్ : సోషల్ మీడియా వినియోగంపై వివిధ వయసుల వారీగా పరిమితులను విధించాలని కేంద్రం భావిస్తోంది. సోషల్ మీడియా వినియోగంపై వివిధ వయసుల వారీగా పరిమితులను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆస్ట్రేలియా దేశం టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధం విధించిన కొద్ది రోజులకే భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెక్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. న్యూఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయం గురించి మాట్లాడారు. డీప్‌ఫేక్ విషయంలో కఠినమైన రూల్స్ అవసరమని, రాబోయే రెండేళ్లలో ఏఐ పెట్టుబడిలో 200 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. సోషల్ మీడియా వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల దృష్ట్యా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాయి. డిసెంబర్ నుండి ఆస్ట్రేలియా టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ , అనేక ఇతర అగ్ర సోషల్ మీడియా సర్వీసెస్‌ను 16 ఏళ్లలోపు వారి ఖాతాలను తొలగించాలని లేకపోతే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదేశించింది. గత నెలలో ఫ్రెంచ్ లామేకర్ 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. "ప్రస్తుతం మేం డీప్‌ఫేక్‌లు,వయసు ఆధారిత నియంత్రణలపై వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. అనేక దేశాలు వయసు ఆధారిత నియంత్రణలను అంగీకరించాయి. ఇండియాలో కూడా ఇది అవసరమని భావిస్తున్నాం " అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 1.4 బిలియన్లకు పైగా జనాభా కలిగిన ఇండియాలో ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే, దేశంలో వందల మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న మెటా నుండి Google వరకు ఉన్న కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో మెటాకు చెందిన ఫేస్‌బుక్, వాట్సాప్ , ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి, గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు కూడా పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం! ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేందుకు , "ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ ( సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్ 2024" పేరుతో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని 2025 డిసెంబర్ 10 నుండి అమల్లోకి రానుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,థ్రెడ్స్,స్నాప్‌చాట్,టిక్‌టాక్, యూట్యూబ్,ఎక్స్, రెడిట్,కిక్ మరియు ట్విచ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ నిషేధం ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తెలిపారు. 16ఏళ్ల లోపు వారు తమ ప్లాట్ ఫారమ్ లలో అకౌంట్లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా కంపెనీలకు భారీ జరిమానాలు విధించనుంది.