జనం న్యూస్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐకి తమ కార్పొరేటర్ల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ మరోసారి ఇదే రకమైన ప్రకటన చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐకి తమ కార్పొరేటర్ల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ మరోసారి ఇదే రకమైన ప్రకటన చేశారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్నాయని దీంతో ఆ రెండు పార్టీలు కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదని చెప్పారు. దీని వెనక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో తనకు తెలియదని అన్నారు. సింగరేణి కార్మికుల ప్రయోజనం కోసమే సీపీఐకి మద్దతు తెలుపాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అయితే హంగ్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు చేశారు. ఇక, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులు ఉండగా సీపీఐ 22 వార్డులు, కాంగ్రెస్ 22 వార్డులు, బీఆర్ఎస్ 8 వార్డులు, బీజేపీ ఒక వార్డు, సీపీఎం ఒక వార్డు, స్వతంత్రులు ఆరు వార్డులలో విజయం సాధించారు. దీంతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అటు కాంగ్రెస్‌కు గానీ, ఇటు సీపీఐకి గానీ మేయర్ పీఠం దక్కాలంటే. మరో 9 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. అయితే సీపీఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అధికార పంపిణీలో భాగంగా చెరో రెండున్నరేళ్లు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేపట్టేలా నిర్ణయానికి వచ్చాయి.