జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి పెద్దపీట వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి పెద్దపీట వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,876.23 కోట్లు కేటాయించటం సంతోషదాయకమని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పేదరిక నిర్మూలనకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.143 కోట్లు అధిక కేటాయింపులు జరిపారని తెలిపారు. ఇది మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధి పురోగతిపట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సెర్ఫ్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, గ్రామ సంఘాల సహాయకులకు గౌరవ వేతనాలు, అలాగే సెర్చ్, డీఆర్డీఏ కార్యాలయాల నిర్వహణకు మొత్తంగా రూ. 464.99 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. అదేవిధంగా దీన్ దయాల్ అంత్యోదయ -జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద రూ.818 కోట్లు, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్ కింద రూ.72 కోట్లు, మహిళా కిసాన్ శక్తీకరణ కింద రూ.30 కోట్లు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కు రూ.15 కోట్లు కేటాయించారన్నారు.దీనదయాల్ అంత్యోదయ యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద రాష్ట్రానికి లభించే వాస్తవ కేటాయింపుల ఆధారంగా అదనంగా రూ.1,200 కోట్లు వరకు పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీంతో 2026-27లో మొత్తం రూ.3,000 కోట్ల వ్యయంతో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధుల మెరుగుదల, ఆదాయ వృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన విధంగా ‘‘ఒక కుటుంబంలో ఒక పారిశ్రమికవేత్త’’ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు 5 లక్షల మహిళలను ఔత్సాహికులుగా తీర్చిదిద్దడం, అలాగే రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *