
పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడుపై గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతోమంది మేధావుల ఆలోచనలు కంటే సీఎం చంద్రబాబు నాయడు ఆలోచనలు ముందు ఉంటాయని ప్రశంసించారు. డిజిటల్ గవర్నెన్స్ అనే ఆలోచనను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు దాని గురించి ఆలోచన చేయడమే కాకుండా అమలు చేశారని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అన్నారు.సచివాలయం సమావేశమందిరంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, సెక్రటరీలతో బిల్ గేట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడారు. తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో బిల్ గేట్స్ పంచుకున్నారు. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్టు బిల్‌గేట్స్ వెల్లడించారు. నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని సమావేశంలో బిల్ గేట్స్ గుర్తు చేశారు. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర ‘భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయి. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయి. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు’అని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అన్నారు.‘నేను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పుడు.. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని గ్రహించాను. నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి’అని బిల్ గేట్స్ పిలుపునిచ్చారు. విద్యాబోధనకు ఏఐ సహాయం ‘కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని సమావేశంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ కితాబిచ్చారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి... వారికి సరైన రీతిలో... తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి AI సహయపడుతుంది అని బిల్ గేట్స్ వివరించారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని బిల్ గేట్స్ చెప్పావు. ‘వ్యవసాయం రంగ చాలా ముఖ్యమైన రంగమని అభిప్రాయపడ్డ బిల్ గేట్స్ ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ కృషి చేస్తోందని బిల్‌గేట్స్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో AI టెక్నాలజీని వినియోగంచడం లేదని కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండం మంచి పరిణామమని బిల్ గేట్స్ వెల్లడించారు. ఐటీని ప్రమోట్ చేసినచంద్రబాబు నాయుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలతో ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు కావడం బాగుందన్న బిల్ గేట్స్ కొనియాడారు. డిజిటల్ గవర్నెన్స్ అనే ఆలోచనను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు దాని గురించి ఆలోచన చేయడమే కాకుండా అమలు చేశారని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ‘డ్రోన్లతో వివిధ రకాల సేవలు వినియోగించుకునే ఆలోచన అద్భుతంగా ఉంది. మలేరియా, అనీమియా జబ్బుల నివారణ కోసం అందరం కలిసి పని చేయాలి.ఈ సమావేశంలో గేట్స్ ను పలు అంశాలపై మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్‌లు ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని ప్రశ్నించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించగా నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని బిల్ గేట్స్ చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని బిల్ గేట్స్ గుర్తు చేశారు. దీనిపై తమ వద్ద పని చేసే వారి అభిప్రాయం కోరితే హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని బిల్ గేట్స్ వివరించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారని బిల్ గేట్స్ వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చంద్రబాబు హర్షం స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పాడుతుందని అన్నారు. బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్‌ను కలిసిన సంగతి, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గేట్స్ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై సీఎ చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలపైనా ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి ‘గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన చారిత్రాత్మకం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుంది. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలబడింది. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి, ఇప్పుడు సంపద సృష్టి జరగాల్సి ఉంది. బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానం. ఇందుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. అమరావతి డిజైన్ అండ్ ఫౌండ్రీ, క్వాంటం వ్యాలీగా ఆవిష్కృతం అవుతుంది. డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లును తీర్చిదిద్దుతున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగం ‘ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘విద్యారంగంలో అధునిక విధానాలను పాటిస్తున్నాం... పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేస్తున్నాం. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నాం. రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నాం. మెరుగైన ప్రజారోగ్య సేవలు అందించేందుకు అత్యున్నత స్థాయి నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేశాం’అని సీఎం అన్నారు. ‘యూనివర్శల్ హెల్త్ స్క్రీనింగ్ విధానం ప్రజలకు ముందస్తుగానే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.