పయనించే సూర్యుడు న్యూస్ : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సోమవారం (ఫిబ్రవరి 16) రోజున ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు వెల్లడించారు. బిల్ గేట్స్ ఈ నెల 16న రాష్ట్రానికి వస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం రోజున అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘‘రేపు అమరావతికి బిల్ గేట్స్ వస్తున్నారు. ఆయన్ను రెండుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే’’ అని చెప్పారు. తొలిసారి హైటెక్ సిటీ (హైదరాబాద్) కోసం, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం బిల్ గేట్స్‌ను రప్పించానని, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామని వివరించారు. ఇదిలాఉంటే, ఈ పర్యటన సందర్భంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న సంజీవని డిజిటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు, ఏఐ ఆధారిత వ్యవసాయం, ఇతర రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చిస్తారు. గేట్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లను కలవనుంది. సోమవారం ఉదయం అమరావతికి రానున్న బిల్ గేట్స్… ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలిస్తారు. అక్కడ రియల్‌టైం గవర్నెన్స్ విధానం, దాని ఫలితాల్ని గేట్స్‌కు చంద్రబాబు వివరిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్బంగా స్వర్ణ ఆంధ్ర విజన్ 2047, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యలో తీసుకువచ్చిన సంస్కరణల వివరాలను ప్రభుత్వం వివరిస్తుంది. అనంతరం అమరావతిలోని ఉండవల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళతారు. అక్కడ వ్యవసాయ కార్యకలాపాలలో డ్రోన్లు, ఏఐ ఆధారిత సాధనాల వాడకంపై ప్రదర్శనలను బిల్ గేట్స్ ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. సంజీవని పథకం. ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో సంజీవని పథకం రూపొందుతుంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకం ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణ వంటి అంశాల్లో పురోగతి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంజీవని పథకం కింద ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్/డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. ఇందులో వైద్య పరీక్షలు, చికిత్స చరిత్ర, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ రికార్డులు స్టోర్ అవుతాయి. మొబైల్ ఫోన్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు. క్యాష్స్, పేపర్‌లెస్ మాత్రమే కాకుండా తక్షణ సాయం అందుతుంది. ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స (యూనివర్సల్ హెల్త్ కవరేజ్). అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల వరకు సాయం అందనుంది. ముందుగానే పరీక్షలు నిర్వహించి అనారోగ్య సమస్యలను గుర్తించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 72.73 లక్షల మందికి 42 రకాల వైద్య పరీక్షలు (రక్త పరీక్షలు, డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత వంటివి) చేస్తారు. ఏఐ ఆధారిత స్క్రీనింగ్, పర్సనలైజ్డ్ మెడిసిన్ కార్యక్రమాన్ని బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సహకారంతో అమలు చేస్తున్నారు. ఇది ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ హెల్త్ సర్వీసెస్తో ఇంటిగ్రేట్ అవుతుంది.యఅమరావతి రాజధాని ప్రాంతంగా ఉండడంతో.. సంజీవని పథకాన్ని ఇక్కడ ప్రధానంగా అమలు చేయాలని చూస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు, పర్సనలైజ్డ్ మెడిసిన్ వంటి అంశాలను అమరావతిలో ఫోకస్ చేస్తున్నారు. ఈ పథకం మొదటి పైలట్ ప్రోగ్రాం కుప్పం నియోజకవర్గం (చిత్తూరు జిల్లా)లో విజయవంతంగా ప్రారంభమైంది. తర్వాత 2026 జనవరి నుంచి చిత్తూరు జిల్లా మొత్తం అమల్లోకి తెచ్చారు. 2026లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అమలు చేస్తారు. 2026 జూలై నాటికి లక్షల మంది స్క్రీనింగ్ పూర్తిచేసి, ఆరోగ్య భద్రతను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది.