కరీంనగర్ మేయర్ కుర్చీపై ఉత్కంఠ

జనం న్యూస్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి మెజారిటీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పొన్నం ప్రభాకర్ ఆదివారం రోజున మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ మాదిరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా బీజేపీ కి మెజారిటీ లేదని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 సీట్లు ఉంటే, బీజేపీ 28 సీట్లు సాధించిందని అయితే మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ లేకపోవడంతో, అక్కడ పార్లమెంట్ సభ్యులు (బీజేపీ నేత ధర్మపురి అరవింద్) ప్రతిపక్షంలో కూర్చుంటామని అంటున్నారని చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, మిగతా పార్టీలు కూడా పలు స్థానాల్లో విజయం సాధించాయని అక్కడ ఏమవుతుందని భవిష్యత్ నిర్ణయియిస్తుందని అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ గెలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని అసలు బీజేపీ వద్ద ఎందరు సభ్యులు ఉన్నారని ప్రశ్నించారు. కరీంనగర్‌లో మొత్తం 66 స్థానాలు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే, మానుకొండూరు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. అంటే మొత్తం 69 సభ్యులుగా ఉంటే, మెజారిటీ మార్క్‌ కోసం 35 సభ్యుల మద్దతు అవసరం ఉంటుందని తెలిపారు. కానీ బీజేపీకి 30 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని అలాంటప్పుడు కరీంనగర్ మేయర్ పీఠం చేపడతామని బండి సంజయ్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి మిగతా పార్టీలకు కూడా వ్యూహాలు ఉన్నాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో ఏ విధంగా వ్యవహరించిందనే అందరికి తెలిసిందేనని అన్నారు. అవినీతిపరులను సైతం వాళ్ల పార్టీలో ఎలా చేర్పించుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీగా గతంలో తాము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్‌లో మేయర్ పీఠం దక్కించుకున్నామని తెలిపారు. ఇప్పుడు స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. బండి సంజయ్ నిజామాబాద్‌లో లాగా ఇక్కడ కూడా ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పాల్సి ఉండేనని అన్నారు. కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకుంటారని అయితే ముఖ్యమంత్రి ,మంత్రులు ,ప్రజా ప్రతినిధులను తిరగనీయం అనేది సరైనది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తాము ఎవరికి వ్యతిరేకమని చెప్పారు. బీజేపీ‌లో గెలిచిన 30 మందికి శుభాకాంక్షలు అలాగే మిగిలిన 36 మందికి శుభాకాంక్షలు అని తెలిపారు. అందరూ కలిసి మేయర్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఉత్తర తెలంగాణ‌లో కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనేది తమ ఆలోచన అని... దానికి అనుగుణంగా మంచి పాలకవర్గం ఉంటే బాగుంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారికి మెజారిటీ ఉంటే తాము అడ్డుపడమని తెలిపారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరిని పదవి నుంచి దింపే ప్రయత్నం చేయడం లేదని తెలిపారు. రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన కూడా లేదని కూడా చెప్పారు. కొత్త పాలకవర్గానికి మంత్రిగా తన సహకరం ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీలకు పొత్తులు ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 16వ తేది ఏమవుతుందో చూద్దామని తెలిపారు.