
సాక్షి డిజిటల్ న్యూస్ : ఏపీలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పేద పశుపోషకులకు 50,000గోకులాలను నిర్మించాలని వ్యవసాయ బడ్జెట్లో పొందుపరిచారు.ఈ గోకులాలను నూరు శాతం రాయితీపై 2.65 లక్షల ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించారు. ‘మనుషులకు ఆధార్ ఉన్నట్లుగా పశువుల గుర్తింపుకు గో-ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం.ఫింగర్ ప్రింట్ వలే పశువుల ముక్కుమీద చర్మం ప్రింట్ ఆధారంగా గుర్తింపుని నమోదు చేస్తాం. దీని ఆధారంగా పశుబీమా ఇతర పథకాలు వర్తిస్తాయి’అని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు / షెడ్యూల్డు తెగలు, పేద పశుపోషకులకు తీపికబురు చెప్పింది. 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించింది.రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం రూ.53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే ఈ గోకులాలను నూరు శాతం రాయితీపై 2.65 లక్షల ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించారు.వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాకు ఐదు చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాలలను నిర్మించాలని, ప్రతిపాదించాం అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశుగ్రాస భద్రతకొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం అని తెలిపారు. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించు యంత్రాలు, మాగుడు గడ్డి తయారీ యంత్రాలు, పశు దాణా, మాగుడుగడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పశువులకు గో-ఆధార్ ‘పశువులు/జీవాలు మరణించినట్లైతే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశువైద్యశాల మరమ్మత్తులు, 400 కొత్త పశువైద్యశాలలు నిర్మాణం దశల వారీగా చేపడతాము’అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘మనుషులకు ఆధార్ ఉన్నట్లుగా పశువుల గుర్తింపుకు గో-ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం.ఫింగర్ ప్రింట్ వలే పశువుల ముక్కుమీద చర్మం ప్రింట్ ఆధారంగా గుర్తింపుని నమోదు చేస్తాం. దీని ఆధారంగా పశుబీమా ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27లో పశుసంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించాం’అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో సాంప్రదాయ విద్య మరియు పరిశోధనలో మార్పులు తీసుకువస్తూ క్లాసు రూము అభ్యసనాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయి అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల పరిశోధనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణలో డి.జి.సి.ఎ. ధృవీకరణను పొందిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534మంది డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు,విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఐ.సి.ఎ.ఆర్.కు పంపించాం. 2026-27లో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం రూ.504.11 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించబడ్డాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాము. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్, వాల్యుయేషన్ ఆఫ్ బనానా సూడో స్టెమ్ మొదలైన కార్యక్రమాలు చేస్తున్నాము. నాణ్యమైన మొక్కల, విత్తనాల అభివృద్ధి కొరకు, కొబ్బరి (22346), టిష్యూకల్చర్ అరటి (10495), కోకో (74345), అంటు మామిడి మొక్కలు (1930), అంటు జీడిమామిడి మొక్కలు (26151) మొదలగు అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేశాం. ఆర్.కే.వి.వై. ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయం పరిధిలో13.13 కోట్ల రూపాయలతో నూతన కార్యక్రమాలు చేపట్టాము. 2026-27లో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్ రూ.97.99 కోట్లు ప్రతిపాదించబడ్డాయి. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం దేశంలోనే మొట్టమొదటిగా పశుసంవర్థక డిప్లొమా కోర్సును ఈ విశ్వ విద్యాలయంలో ప్రారంభించాం. రేబిస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధన శాలను విశ్వవిద్యాలయానికి కేటాయించబడినది. ఈ విశ్వవిద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయిలు వివిధ విభాగాల అభివృద్దికి కేటాయించబడింది. సుమారు 208 లక్షల ఒంగోలు జాతి, 132 లక్ష పుంగనూరు జాతి వీర్యనాళికలు, 900 వనరాజా కోళ్ళను రైతులకు అందజేసాము. స్వజాతి పశువులు అంతరించి పోకుండా, వాటి ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి చేసేవిధంగా తయారు చేయడానికి పశువైద్యవిశ్వవిద్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానముతో ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27లో శ్రీ వేంకటేశ్వరపశువైద్య విశ్వవిద్యాలయంకోసం బడ్జెట్ రూ.163.01 కోట్లు ప్రతిపాదించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యం మత్స్య మరియు ఆక్వాసాగురంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, మరియు పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో RSK లకు సాంకేతిక సాయం అందించడం. 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంకోసం రూ.39.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించబడ్డాయి.