
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ విద్యపై సంచలన నిర్ణయం తీసుకుంది. నర్సింగ్ ప్రవేశాలను NEET-UG పరీక్ష ఆధారంగా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. నర్సింగ్ విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని నిర్ణయించుకుంది.గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET నిర్వహించారు. అయితే 16000 సీట్లకు గాను 4000 సీట్లు మిగిలిపోయాయి. దీంతో వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజా ప్రతిపాదనలు సమర్పించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు.ఇకపై నర్సింగ్ ప్రవేశాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలంటే నీట్-యూజీ తప్పనిసరి. విద్యా రంగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను నీట్-యూజీ పరీక్ష ఆధారంగా నిర్వహించాని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీట్ యూజీ పరీక్ష ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ క్రమంలో ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష చేపట్టారు. నర్సింగ్ ప్రవేశాలకు ఉత్తమ విధానంపై చర్చించారు.