కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బహిర్గతం

★ స్వేచ్ఛ కోరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

జనం న్యూస్: కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా కుట్ర పూరితంగా దోహదపడ్డాడో. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలానే కారకుడు అయ్యాడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలవాల్సింది పోయి సంజయ్ వల్ల కేవలం 20-22 స్థానాలకి పరిమితమవ్వాల్సి వచ్చిందని పెదవి విరిచారు. ఇప్పటికైనా తమకు స్వేచ్ఛ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అధో:పాతాళానికి చేర్చాడంటూ ఘాటు విమర్శలు చేశారు. కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా కుట్రపూరితంగా దోహదపడ్డాడో...జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారకుడు అయ్యాడని మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలుస్తామనుకుంటే 20-22 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైందని అన్నారు. ఇప్పటికైనా తమకు స్వేచ్ఛ ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి వేడుకుంటున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేడుకున్నారు. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ అవకాశం ఇవ్వాలి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జండా మోసిన కార్యకర్తలకే చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని. అవకాశ వాదులకు ఇవ్వొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నుంచి స్వేచ్ఛను ప్రసాదించాలని జీవన్ రెడ్డి చేతులు జోడించి కోరారు. రాయికల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులు 8 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్కటి గెలిచారని, మేము మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండు గెలుచుకున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాల మూలంగా బీ ఫామ్ పంపిణీ లో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా నేడు స్వతంత్రుల పై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అయినప్పటికీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామ‌ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఓడించిన ఎమ్మెల్యే సంజయ్. మరోవైపు టికెట్లు రాని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ప్రచారం చేయాల్సి వచ్చిందని. పార్టీ సూచించిన అభ్యర్థులకు ప్రచారం చేయలేకపోయామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను ఓడించడానికి ఎమ్మెల్యే సంజయ్‌ ప్రచారం చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు గెలిచిన అభ్యర్థులను లోబర్చుకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి విప్‌న‌కు అనుగుణంగా ఓటు వేస్తామని చెబుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. తాను స్వతంత్రులకు తోడుగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తేలేదు అని ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతం నుంచే జీవన్ రెడ్డి ఫైర్. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం హస్తం పార్టీలో అగ్గి రాజేస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకానొక దశలో ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక పార్టీలో సీనియర్ అయిన తనను సంప్రదించకుండా సంజయ్‌ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించారు అయినప్పటికీ ఆయన శాంతించలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో వెనక్క తగ్గారు. దీంతో సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికకు లైన్ క్లియర్ అయ్యింది.‘కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సరిపడ ఎమ్మెల్యేలు ఉన్నందున ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదనే తన వాదనను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తావించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందేనని అన్నారు. కార్యకర్తలు ఏ విధంగా మనస్తాపానికి గురయ్యారనేది అంతా చూస్తున్నారని చెప్పారు. ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేదని కొంత బాధతో ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం ఎంతగానో శ్రమించామని చెప్పారు. ఇంతకాలం ఇక్కడ ఎవరితోనైతే పోరాటం చేశామో. అతడినే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కార్యకర్తలు బాధతో ఉన్నారని చెప్పారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారని. కానీ ఆ చేరిక అనేది ఆయా ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి మండిపడుతున్న సంగతి తెలిసిందే.