
జనం న్యూస్: ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. 2026-27ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు రూ.6357 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది 6లక్షల ఇళ్లు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతీ కుటుంబానికి పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం అని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇకపోతే 2026-27ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు రూ.6357 కోట్లు మేర కేటాయింపులు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ నిర్వీర్యమైపోయింది అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గతంలో గృహ నిర్మాణ పథకం కోసం కేటాయించిన సుమారు రూ.3,300 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించారు అని ఆరోపించారు . జూన్ 2024 నుంచి ఆ నిధులను గృహ నిర్మాణానికి వినియోగించి 3లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సుమారు 6 లక్షల లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎస్సీ,బీసీ వర్గాలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అలాగే అర్హులైన ప్రతీ కుటుంబానికి పీఎంఏవై- గ్రామీణ పథకం కింద ఇళలను మంజూరు చేస్తాం అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి ఇఫ్పుడు కూటమి ప్రభుత్వం సమర్ధ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఖర్చులు తగ్గించుకుని వనరులు పెంచుకుని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తుంది అని పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం అని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ రోజు బడ్జెట్లో కేటాయిస్తున్న ప్రతీ రూపాయి ప్రజల కష్టార్జిత ధనంగా చెప్పుకొచ్చారు. ఆ ప్రతి రూపాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకు రావాలనే ఉద్దేశంతో. సమర్ధవంతంగా మరియు బాధ్యతా రాహిత్యంగా వినియోగిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో వెల్లడించారు. సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు. ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్థ పరిస్థితులని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం అని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి తమ లక్ష్యాలలో మార్పులేదు. మా సంకల్పం చెక్కు చెదరలేదు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్రమోడీ నుంచిఅమూల్య మైన మద్దతు, సహకారం లభిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పున: ప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.