
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ఉదయం 11.22 నిమిషాలకు పెట్టారు. ఈసారి బడ్జెట్‌ను రూ.3.32 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు చేశారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకముందు ఏపీ కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ 2026-27 రూ.3.45 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు ప్రాధాన్యం దీపం 2.0 - రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు హోంశాఖ- రూ.9,165 కోట్లు * మున్సిపల్ శాఖ-రూ.14,539 కోట్లు జలవనరుల శాఖ రూ.18,224 కోట్లు హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు మధ్యాహ్న భోజన పథకం.. రూ.2,161 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు పోలవరం ప్రాజెక్టు – రూ.6,105 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు మత్స్యకార సేవలో – రూ.260కోట్లు పంటల బీమా – రూ.250 కోట్లు పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లు విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు పరిశ్రమలకు రూ.3,161 కోట్లు సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు అమరావతి కోసం రూ.6వేల కోట్లు తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు బీసీలకు 23,650 కోట్లు *విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు మూలధన వ్యయం రూ.53,915 కోట్లు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు 2026-27 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం: పయ్యావుల ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా బడ్జెట్: పయ్యావుల బడ్జెట్‌ను రూ.3.32 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేసిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనమండలిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి వంగలపూడి అనిత మండలిలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల ఉదయం 11:15 గంటలకు ప్రారంభం కానున్న ఏపీ శాసనసభ, మండలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్.. దాదాపు రూ.3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండొచ్చంటున్నారు. ఇవాళ ఉదయం ఏపీ కేబినెట్ ఉదయ 10.30 గంటలకు సమావేశం అవుతుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఉదయం 11:15 నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెడతారు.. ఆ తర్వాత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ సమర్పిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి అనిత.. వ్యవసాయ బడ్జెట్‌ను రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయసభలూ వాయిదా వేస్తారు.. ఈ నెల 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపుతారు. 2025-26లో బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు.. అది ఈసారి రూ.3.46 లక్షల కోట్ల వరకు ఉంటుందంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయంటున్నారు. అలాగే పోలవరం, అమరావతి, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మూడు ఆర్థిక జోన్లకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుంది అంటున్నారు. 16వ ఆర్థికసంఘం గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని నిధులివ్వాలని సిఫార్సు చేసింది. గతంతో పోలిస్తే ఈ జనవరి నెలాఖరు 4శాతం అదనంగా రాబడి వచ్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు రూ.35వేల కోట్లు అవసరమవుతాయి.. ఆ మేరకు కేటాయింపులు ఉంటాయంటున్నారు. మిగిలిన సంక్షేమ పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.