
జనం న్యూస్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. 40 శాతం పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువగా ఉన్నాయి’అని ఐటీ,విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు అని ప్రశ్నించారు. నేడు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం అని శాసనమండలిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు- నేడు, మనబడి -మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలు, ఆయా పథకాల కింద పూర్తిగా అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల వివరాలపై సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వివరించారు. 18 అంశాలపై స్టార్ రేటింగ్ ‘ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని నేను చెప్పాను. 18 అంశాలపై స్టార్ రేటింగ్ ఇచ్చాం. స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత మేం గమనించింది.. సుమారు 40 శాతం పాఠశాలలు 2స్టార్ కంటే తక్కువగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం’ ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అని చెప్పుకొచ్చారు. ‘నేను చిత్తూరు పర్యటకు వెళ్లినప్పుడు కొన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, పేయింటింగ్, బేసిక్ బెంచెస్, ఫర్నిచర్స్ లేవు. ముందు లీక్ ప్రూవ్ బిల్డింగ్స్, బెంచ్ లు, పెయింటింగ్, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం సమీక్ష చేస్తున్నాం. జీవో 117కు ప్రత్యామ్నాయంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని తీసుకువచ్చాం’అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 233 పాఠశాలలు మూసీవేయడం జరిగింది. ‘గతంలో కేవలం 3 శాతం పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడు ఉంటే.. ఇప్పుడు 33 శాతానికి తీసుకువచ్చాం. దీనివల్ల కొన్ని పాఠశాలల్లో ఎక్కువ తరగతి గదుల అవసరం ఉంది. వీటన్నింటిని పరిశీలించి మేం ముందుకు వెళ్తాం’విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.‘గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూసివేయడం జరిగింది. నిధులు అనవసరంగా వృధా చేయకూడదు. ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ పైనా దృష్టి సారించాం. 2019 నంచి 2024 వరకు లెర్నింగ్ అవుట్ కమ్స్లో వెనుకబడ్డాం’అని ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో నాడు-నేడు కింద రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాం. ‘వైసీపీ హయాంలో నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు? బిల్లులు చెల్లించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కూటమి ప్రభుత్వంలో రూ.500 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించడం జరిగింది. ఈ వివరాలన్నీ గత అసెంబ్లీ సెషన్స్ లో విద్యారంగంపై లఘు చర్చలో వెల్లడించాం’అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.‘వైసీపీ వాకౌట్ చేయకుండా హౌస్ లో ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడిని. వాకౌట్ చేశారు కాబట్టి మీకు సబ్జెక్ట్ తెలియడం లేదు. వైసీపీ హయాంలో అద్భుతంగా పనిచేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఎందుకు పడిపోయాయి? ఎఫ్ఎల్ఎన్ చూస్తే.. 84.3 శాతం మూడో తరగతి, 62.5 శాతం ఐదో తరగతి, 47 శాతం 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. అందుకే ఏఐ టూల్ ద్వారా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం’అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.