రూ.3.60 లక్షల కోట్ల రఫెల్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్

★భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు రాక!

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించడంతో ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిర రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది. అందుకు అవసరమైన రక్షణ మంత్రి నాయకత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ నుంచి ఆమోదం లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మరో నాలుగు రోజుల్లోనే న్యూఢిల్లీలో అడుగుపెట్టనున్న సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. అయితే, తుది నిర్ణయం మాత్రం మోదీ నుంచి రావాల్సి ఉంటుంది. దేశ రక్షణకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా రఫేల్ యుద్ధ విమానాలు భారీ ఎత్తున కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.3.60 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌ నుంచి 114 రఫెల్ జెట్లు కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 18న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత్ పర్యటనకు రానున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే, దీనిపై ఇరు దేశాల మధ్య అధికారిక ఒప్పందం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 114 రఫెల్ యుద్ద విమానాల్లో 88 సింగిల్ సీట్‌, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉన్నాయి. ఇవి భారత వైమానిక దళంలో సేవలు అందించనున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా తయారీ, అసెంబుల్డ్ వాటి కోసం ఫ్రాన్స్ ‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌.. భారత్‌లోని ప్రయివేటు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే భారత్ 36 రఫేల్‌ యుద్ధవిమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఫ్రాన్స్ రక్షణ తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి 18 విమానాలను కొనుగోలు చేస్తారు. మిగిలిన 96 జెట్‌లు భారత్‌లో తయారవుతాయి. ఈ ఒప్పందంలో అధునాతన ఫైటర్ జెట్ టెక్నాలజీ బదిలీ ఉంటుంది. ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నుంచి మాత్రం అనుమతి తప్పనిసరి. భారత వైమానిక దళానికి మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ప్రోగ్రామ్‌కు మాత్రమే కాకుండా కంబాట్ క్షిపణులు, ఎయిర్-షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ (AS-HAPS) కొనుగోలు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.