
పయనించే సూర్యుడు న్యూస్ : ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం! 6 బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించింది. ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా 15,16 తేదీలో సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 17 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఇకపోతే ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఫిబ్రవరి 17,18 తేదీలలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏపీలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 10న ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడగడుగునా అడ్డుపడ్డారు. నిరసనలు, నినాదాల నడుమ గవర్నర్ ప్రసంగం జరిగింది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే వైసీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. మరోవైపు కూటమి సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యారు.ఉదయం 9.30 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 9.45 గంటలకు అసెంబ్లీకి హాజరయ్యారు. 9.57 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గవర్నర్ ప్రసంగం అనంతరం సభలో ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 12న ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇస్తారు. ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. ముగిసిన బీఏసీ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సభ ఎన్ని రోజులు నిర్వహించాలి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి...ప్రభుత్వ వ్యవహారాలు అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశంలో నిర్ణయాలు మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్న సభ్యులు 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనన్న ప్రభుత్వం ఈనెల 15 ఆదివారం, 16 శివరాత్రి సందర్భంగా సెలవులు మొత్తం అసెంబ్లీ పని దినాలు 11, 12, 13 ,14, 17, 18 ,19 ,20 21, 22 అసెంబ్లీకి సెలవు 23, 24 ,25 ,26 అసెంబ్లీ పని దినాలు ఫిబ్రవి 28 మార్చి 1 అసెంబ్లీకి సెలవు మార్చి 2,3,4,5,6,7 తేదీల్లో కొనసాగనున్న అసెంబ్లీ మార్చి 5 ,6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు అసెంబ్లీలో మొత్తం 6 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ప్రశ్నోత్తరాలు. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది18న ఆర్థికశాఖ మంత్రిపయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు.