జనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి

★జాతీయ గేయంపై కేంద్రం కొత్త నిబంధనలు ఇవే...

సాక్షి డిజిటల్ న్యూస్ :జాతీయ గేయం వందేమాతరం విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. జాతీయ గేయం వందేమాతరం విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కొత్త నిబంధనలను జారీ చేసింది.'వందేమాతరం' పాడినప్పుడు అందరూ లేచి నిలబడాలని కొత్త నిబంధనలలో కోరింది. పద్మ అవార్డుల వంటి పౌరపురస్కారాల ప్రదాన వేడుకలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాలలో... వారి రాక, నిష్క్రమణ సమయంలో కూడా వందేమాతరం ప్లే చేయాలని తెలిపింది. సినిమా హాళ్లు వంటి బహిరంగ ప్రదేశాలలో కూడా వందేమాతరం ప్లే చేయాలని... అయితే ఈ సందర్భంలో లేచి నిలబడటం తప్పనిసరి కాదని పేర్కొంది. అంటే, అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం ప్లే చేస్తున్నప్పుడు లేదా పాడుతున్న సమయంలో నిలబడటం తప్పనిసరి... అయితే సినిమా హాళ్ల వంటి వేదికలలో మధ్యలో వందేమాతరం గేయం ప్లే అయినప్పుడు లేచి నిలబడటం తప్పనిసరి కాదు. 1937లో కాంగ్రెస్ తొలగించిన నాలుగు చరణాలతో సహా మొత్తం ఆరు చరణాలు ఆలపించాలని తెలిపింది. ఈ వ్యవధి 3 నిమిషాల 10 సెకన్లుగా ఉంది. ఇక, వందేమాతరం అనేది ఒక గేయం మాత్రమే కాదు... భారత స్వాతంత్ర్య పోరాటానికి ఆత్మగా నిలిచింది. ఈ పాట బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది భారతీయులను ఏకం చేసి... దేశ స్వాతంత్ర్య పోరాట నినాదంగా మారింది. దేశభక్తి, మాతృభూమి పట్ల గౌరవానికి చిహ్నంగా నిలిచింది.